ఖమ్మం జిల్లాలో కరోనా పేషేంట్లకు ఇంటి నుంచే క్యారియర్లు

ఖమ్మం జిల్లాలో కరోనా పేషేంట్లకు ఇంటి నుంచే క్యారియర్లు

కూసుమంచి మండలానికి చెందిన ఒక మహిళ సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొ విడ్​ఐసోలేషన్ సెంటర్‌‌కు వచ్చారు. తనతోపాటు క్ యారియర్‌ తీసుకొచ్చారు.కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో ఉన్న ఆమె భర్త అక్కడ పెట్టే ఆహారాన్ని తినలేకపోతున్నానంటూ చెప్పడంతో  ఇంటి నుంచి తీసుకొచ్చి నట్టు ఆమె చెప్పారు. ఈమె ఒక్కరే కాదు, ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రానికి ఇంటి నుంచి, హోటళ్ల నుంచి క్యారియర్లు, పార్శిళ్లు వస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో ని కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఆహారం, ఇతర సౌకర్యాల విషయంలో మెనూ పాటించకపోవడంతో బాధితుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి ఫుడ్ తినలేక ప్రభుత్వా స్పత్రిలోని వార్డుతోపాటు, శారద కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులు బయటనుంచి ఫుడ్ పార్శిళ్లను తెప్పిం చుకుంటు న్నారు. అయితే ఈ తీరు కారణంగా వైరస్ మరింత మందికి వ్యాపించే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా ప్రభుత్వం నిర్ణయిం చిన మెనూ ప్రకారం ఆహారాన్ని పేషెంట్లకు ఇవ్వాల్సి ఉంది. అలా ఇవ్వకపోవడంతో పార్శిళ్లు తెప్పించుకొని తింటు న్నారు. దీన్ని అక్కడి డాక్టర్లు, సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే క్యారియర్లు తెస్తున్న వాళ్లు అంతకుముందు రోజు తెచ్చి ఖాళీ అయిన క్యారియర్లను మళ్లీ ఇంటికి పట్టుకుపోతుండడంతో వాటి ద్వా రా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

ఫుడ్‌ బాగాలేదని ఆందోళనలు

ప్రభుత్వ అధికారులు చెబుతున్న ప్రకారం ఐసోలేషన్‌ సెంటర్‌‌లో ఉన్న ప్రతి పేషెంట్ కు ఆహారం కోసమే రోజుకు రూ.200 చొప్పున డైట్ చార్జీలకు బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. పాలు, మజ్జిగ, కూర, చారు, పండ్లు, ఖర్జూరాతోపాటు టీ, బిస్కె ట్లను కూడా ఇవ్వాల్సి ఉంటుం ది. పైఆఫీసర్లు రూపొందిం చిన మెనూ ప్రకారమే ఐసోలేషన్‌ సెంటర్లలో పేషెంట్లకు ఫుడ్‌ అందిస్తున్నామని చెబుతున్నా, పేషెంట్లు, వారి బంధువుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మొన్నటివరకు మద్దులపల్లిలో ని యూత్ ట్రైనింగ్ సెంటర్‌‌లో కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌‌ నిర్వహించా రు. అక్కడ వసతులు సరిగా లేవని, ఆహారం సరిగా ఇవ్వడం లేదని ఆందోళనలు సైతం చేశారు. దీంతో మద్దులపల్లిలో ని వైటీసీ కొవిడ్ కేర్‌‌ సెంటర్‌‌లో ఉన్న పేషెంట్లను గత వారం శారద కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కు తరలించా రు. అయితే అక్కడ కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక గదుల్లో శానిటైజేషన్ రెగ్యులర్‌‌గా చేయడం లేదని, డాక్టర్ల పర్యవేక్షణ కూడా సరిగా లేదని ఆరోపిస్తున్నారు.

 

ప్రభుత్వ మె నూ ప్రకారం ఫుడ్​

జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌ లో ప్రభుత్వం సూచించి న మెనూ ప్రకారం సీనియర్​ డైటీషియన్‌ ఆధ్వర్యంలో పేషెంట్లకు ఇస్తున్నాం. టిఫిన్, మంచి భోజనంతో పాటు డ్రై ఫ్రూట్స్‌ పెడుతున్నాం. హోటళ్ల నుంచి ఫుడ్ పార్శిళ్లు వస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అలాంటివి జరగకుం డా చర్యలు తీసుకుంటాం.- వెంకటేశ్వర్లు, జిల్లా ఆస్పత్రి సూపరిం టెండెంట్