అక్టోబరులో నింగికి ‘కార్టోశాట్–3’

అక్టోబరులో నింగికి ‘కార్టోశాట్–3’

ఇస్రో కార్టోశాట్​సిరీస్​లోని మరో శాటిలైట్ ‘కార్టోశాట్-3’ త్వరలో నింగికి చేరనుంది. ఇది భూమిని మరింత స్పష్టంగా, 25 సెంటీమీటర్ల రెజల్యూషన్​తో ఫొటోలను తీసి పంపించనుంది. ​‘కార్టోశాట్–3’ని అక్టోబరు చివరి వారం లేదా నవంబరు మొదటి వారంలో పీఎస్​ఎల్ వీ రాకెట్​ ద్వారా నింగికి పంపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్‌‌‌‌ కే శివన్ వెల్లడించారు. కార్టోశాట్–2 సిరీస్ శాటిలైట్లతో పోలిస్తే ఈ శాటిలైట్​మరింత అడ్వాన్స్ డ్​టెక్నాలజీతో తయారైందని ఆయన తెలిపారు. ఇది భూమి ఫొటోలను మరింత స్పష్టంగా, కచ్చితత్వంతో తీసి పంపనుందని పేర్కొన్నారు. దీనిని 2014లోనే ప్రయోగించాలని భావించినా, కార్టోశాట్–2 సిరీస్లో మరిన్ని శాటిలైట్లను ప్రయోగించాలని ఇస్రో దీనిని వాయిదా వేసింది. 2017లో కార్టోశాట్​–2డీ, 2ఈ శాటిలైట్లను పంపింది. ఇకపై కార్టోశాట్–3 సిరీస్లో వరుసగా రిమోట్​సెన్సింగ్ శాటిలైట్లను నింగికి పంపేందుకు సిద్ధమవుతోంది.