కారు రివర్స్ చేస్తూ చనిపోయిన యువతి స్నేహితుడిపై హత్య కేసు

కారు రివర్స్ చేస్తూ చనిపోయిన యువతి స్నేహితుడిపై హత్య కేసు

కొన్ని రోజుల క్రితం.. మహారాష్ట్రలో సోషల్ మీడియా రీల్ కోసం కారు రివర్స్ చేస్తూ.. బ్రేక్ బదులు యాక్సిలేటర్ నొక్కి.. లోయలో పడి చనిపోయిన యువతి గుర్తుంది కదా.. ఇప్పుడు ఆ యువతి స్నేహితుడిపై హత్య కేసు నమోదైంది. అవును మీరు చదువుతున్నది నిజమే.. అసలు ఆ యువతికి డ్రైవింగ్ వచ్చా రాదా.. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా కారు తాళాలు ఇవ్వటం.. వీడియో కోసం ప్రోత్సహించటం వంటి కారణాలతో చనిపోయిన యువతి శ్వేత స్నేహితుడు సూరజ్ పై పోలీసులు హత్య కేసు ఫైల్ చేశారు. 

చనిపోయిన యువతి శ్వేత బంధువులు దీన్ని హత్యకు వ్యూహ రచనగా చెబుతున్నారు. ఈ మేరకు కంప్లయింట్ చేయటంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. సెక్షన్ 304 (A) కింద హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

దీనిపై సోషల్ మీడియా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆ యువతి కోరిక మేరకే రీల్ కోసం వీడియో తీయటం జరిగిందని.. ఈ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయని.. ఆ యువతి ప్రమేయం లేకుండా ఆ యువకుడిని ఎలా తప్పుబడతారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మనిషిగా ఉండటం నేరం అయిపోయిందా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది హత్యానేరం కిందకు వస్తుందా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.