
భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై కేసు నమోదైంది . లాక్‌డౌన్ సమయంలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయనతో పాటు మరో 28 మందిపై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఎమ్మెల్యే పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కు ధరించకుండా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారని… దీంతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ , 1,897, ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సీఐ వినోద్ తెలిపారు.