
సమాజంలో ఎప్పుడు ఏ క్రైం జరుగుతుందో అని ఒకవైపు పోలీసులు.. ఆడపిల్లలపై ఎప్పుడు ఏ అఘాయిత్యం జరుగుతుందోనని మరోవైపు తల్లిదండ్రులు భయపడుతున్న రోజుల్లో.. కొందరు యువతులు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. జాబ్ పేరున.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఓ యువతి బాయ్ ఫ్రెండ్ తో కలవటం ఇష్టం లేక.. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏకంగా ఒక నగరాన్నే.. కాదు కాదు.. దేశం మొత్తాన్నే టెన్షన్ పెట్టింది. చివరికి అందరినీ పిచ్చోళ్లను చేసింది.
పుణెలోని పదకొండో అంతస్తులో కొరియర్ బాయ్ అత్యాచారం చేసిన ఘటన గురించి తెలిసిందే. కొరియర్ డెలివరీ చేసేందుకు వచ్చి స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొరియర్ బాయ్స్ ఇలా కూడా చేస్తారా.. జాగ్రత్త.. అన్నట్లుగా అందరూ అలర్ట్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పది బృందాలుగా గాలింపు చేపట్టి ఎట్టకేలకు కొరియర్ బాయ్ ని పట్టుకున్నారు. ఆ తర్వాత ట్విస్టును చూసి పోలీసులు అవాక్కయ్యారు.
ఆ రోజు సెక్స్ ఇష్టం లేకే:
బుధవారం (జులై 02) పుణె కొంధ్వా ఏరియాలో అత్యాచారానికి గురైనట్లు ఓ 22 ఏళ్ల సాఫ్ట్ వేర్ యువతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కొరియర్ బాయ్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని.. గంట తర్వాత మెలకువ వచ్చాక చూస్తే.. తాను అత్యాచారానికి గురైనట్లు గుర్తించానని తెలిపింది. బంధువులకు ఫోన్ చేసి అందరినీ పిలిపించుకుంది. ఆ యువతికి అన్యాయం జరిగిందనుకుని అందరూ దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించారు.
పోలీసులు ఆ సదరు కొరియర్ బాయ్ ని శుక్రవారం (జులై 04) పట్టుకున్నాక దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమెను రేప్ చేయలేదని.. రెగ్యులర్ గా సెక్సువల్ గా కలుస్తుంటామని అతడు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత పోలీసులు వాళ్ల స్టైల్ లో ఆమెను విచారించగా.. ఆ టైమ్ లో తనకు సెక్స్ ఇష్టం లేదని.. కానీ అతడు ఒత్తిడి చేయడంతో అలా చేశానని చెప్పింది. బలవంతంగా అలా చేయడంతో ఆ కోపాన్ని తట్టుకోలేక అలా కంప్లైంట్ ఇచ్చినట్లు ఒప్పుకుంది.
కంప్లైంట్ లో కొరియర్ బాయ్ అత్యాచారం చేసి.. సెల్ఫీ తీసి ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పినట్లు పేర్కొంది. కానీ.. సెల్ఫీ ఆమెనే తీసి.. ఎడిట్ చేసి కథ అల్లిందని పోలీసుల విచారణలో తేలింది. బెదిరిస్తున్న మెసేజ్ కూడా ఆమెనే టైప్ చేసినట్లు తెలిసింది.
జాబ్ పర్పస్ లో కొన్నాళ్లు అక్కా తమ్ముడు ఆ ఫ్లాట్ లో ఉండగా.. తమ్ముడు ఊరెళ్లిన తర్వాత యువతి ఒంటరిగానే ఉంటోంది. ఆ క్రమంలో కొరిబాయ్ గా చెప్పిన వ్యక్తితో ఒక పెళ్లిలో పరిచయం ఏర్పడి.. అది డీప్ లెవెల్ కు వెళ్లింది. ఇద్దరూ తరచుగా ఫ్లాట్ లో కలిసేవారట. యువతి పేరెంట్స్ ఉన్నప్పుడు కొరియర్ ఇచ్చి వెళ్లేవాడని.. ఒంటరిగా ఉన్నపుడు ఇద్దరూ ఫ్లాట్ లో గడిపేవారని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. సెక్సువల్ గా కలవటం కూడా అది మొదటి సారి కాదని తేలింది. అయితే ఆ రోజు తనకు ఇష్టం లేకున్నా ఫోర్స్ చేయడంతో అలా చేసినట్లు చెప్పిందని పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.