
చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి తొలిఏకాదశి సందర్భంగా చెన్నూరు మదన పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి మరియు మొహరం పండగల శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.దేవుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా, సమృద్ధిగా ఉండాలని.. ఈ ఏడాది వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షించారు మంత్రి వివేక్.
ALSO READ | ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
తొలి ఏకాదశి అంటే పండగల శుభారంభమని.. రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఒకప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణను అన్ని రంగాల్లో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను నిష్టతో అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.