ట్రేడింగ్ పేరుతో భారీ మోసం..తిరుపతిలో 34 లక్షలు పోగొట్టుకున్న ప్రైవేట్ ఉద్యోగి

ట్రేడింగ్ పేరుతో భారీ మోసం..తిరుపతిలో 34 లక్షలు పోగొట్టుకున్న ప్రైవేట్ ఉద్యోగి

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో   బిజినెస్ లు, ఆఫర్లు,ఇన్వెస్ట్ మెంట్లు, ట్రేడింగ్ లు,ఉద్యోగాలు ఇలా రకరకాల పేరుతో లింకులు పంపి..అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి  దొరికిన కాడికి దోచేస్తున్నారు కేటుగాళ్లు. వాళ్ల మాయమాటలు నమ్మి రోజుకు ఎంతో మంది సైబర్ మోసాల బారిన పడి బలవుతున్నారు. లక్షలు పోగొట్టుకుంటున్నారు.  లేటెస్ట్ గా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగింది. 

సైబర్  నేరగాళ్ల వలలో చిక్కుకుని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏకంగా రూ. 34 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటట్రేడింగ్ అలవాటు ఉన్న ఓ ఉద్యోగిని ఇన్వెస్ట్ చేయాలంటూ వాట్సప్ కాల్ వచ్చింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి లింకులు పంపి లాగిన్ అయ్యేలా చేశారు  సైబర్ నేరగాళ్ళు. రూ.  1.5 కోట్లు లాభాలు చూపించి  రూ. 34 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. తీరా డబ్బులు   విత్ డ్రా కావాలంటే మరో రూ. 28 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటూ బాధితుడిని డిమాండ్ చేశారు.

ALSO READ | రూ.50 లక్షలు ఇస్తే కోటి రూపాయల ఫండ్.. హైదరాబాద్ ట్రస్ట్ ఓనర్ను మస్కా కొట్టించి డబ్బుతో పరారైన కేటుగాళ్లు

 దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు  సైబర్ డెస్క్  1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.  తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్టాక్​ ట్రేడింగ్​ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.67 లక్షలు కొట్టేసిన ఇద్దరిని సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్​కు చెందిన దేవరాజ్ బాయ్ రామాణి, గొండలియ హార్దిక్ కుమార్ ఆన్​లైన్​లో మోసాలు చేస్తున్నారు.  స్టాక్ ట్రేడింగ్​లో టిప్స్ ఇస్తామని ఓ వాట్సప్ గ్రూప్ లో యాడ్ చేశారు. ఆయనను నమ్మించి రూ.67. 60 లక్షలు కాజేశారు. బాధితుడు ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇద్దరు నిందితులను జులై 4న  అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.