ఎంజీఎంలో బాలుడి మృతి ఘటనలో చర్యలు  

ఎంజీఎంలో బాలుడి మృతి ఘటనలో చర్యలు  


ఎంజీఎం, వెలుగు : ఎంజీఎం అనస్థీసియా విభాగం డాక్టర్లపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. గత ఆదివారం జిల్లాలోని కన్నారావుపేటకు చెందిన నిహాన్​(8) ఆడుకుంటూ కిందపడిపోగా కుడి చేయి విరిగింది. దీంతో బాలుడిని ఎంజీఎంకు తీసుకురాగా సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ఆపరేషన్​ చేయడానికి ముందు మత్తు మందు ఇవ్వగా కొద్దిసేపటికే నిహాన్​ చనిపోయాడు. ఈ ఘటన ఆ రోజు ఉద్రిక్తతకు దారి తీయగా దవాఖానా ఉన్నతాధికారులు, పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ నేపథ్యంలో మత్తుమందు ఇచ్చిన అనస్థీసియా డాక్టర్​ శ్యాంకుమార్​తో పాటు మరో ఇద్దరు డాక్టర్లపై మట్టేవాడ పోలీస్ ​స్టేషన్​లో 304 సెక్షన్​కింద కేసు నమోదు చేశారు. అలాగే అనస్థీసియా విభాగాధిపతి నాగార్జున రెడ్డిపై కూడా చీఫ్​ సెక్రెటరీకి సూపరింటెండెంట్​ ఫిర్యాదు చేశారు. మత్తు మందు ఇచ్చేప్పుడు నాగార్జునరెడ్డి ఎంజీఎంలో లేడని, అతడి ప్రైవేటు దవాఖానాలో ఉన్నాడని తెలుస్తోంది.