బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

జూబ్లీహిల్స్,​ వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి తన సోషల్ మీడియా చానల్ ద్వారా సీఎంపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.