- ఇద్దరిపై కేసు నమోదు
జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదైంది. గాజులరామారం సర్వే నంబర్ 342లోని కైసర్‌నగర్‌లో కొంతమంది ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులు ఆర్‌ఐకు అందాయి.
దీనిపై ఫీల్డ్ విజిట్ చేసిన ఆయన జేసీబీతో ప్రభుత్వ భూమిలో మట్టి పోసి చదును చేస్తున్నట్టు గుర్తించారు. జేసీబీ డ్రైవర్ వెంకటస్వామిని ప్రశ్నించగా, సాయిరాజ్ అనే వ్యక్తి తన జేసీబీని అద్దెకు తీసుకుని భూమిని లెవెల్ చేయాలని చెప్పినట్లు తెలిపాడు. దీంతో సాయిరాజ్, డ్రైవర్ వెంకటస్వామిపై ఆర్‌ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
