సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు..ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు నమోదు

సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు..ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు నమోదు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై  హైదరాబాద్  బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.  సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  కాంగ్రెస్ నేత మల్లు రవి ఇచ్చిన ఫిర్యాదుతో  జనవరి 12న  పోలీసులు  కేసు ఫైల్ చేశారు.  నారాయణ స్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు , ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఆయన మాట్లాడినట్లు నిర్దారించారు. ఆయనపై ఐపిసి 504 , 505(2), r/w 34 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ సిఐ శంకర్ తెలిపారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీసీసీ వైస్​ప్రెసిడెంట్​ మల్లు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణ స్వామిపై జనవరి 9న  బేగంబజార్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. వైఎస్సార్​ సోనియాకు విధేయుడుగా ఉండేవా రని గుర్తుచేశారు. 2004, 2009 రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. నారాయణ స్వామి రాజకీయ స్వలా భం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.