
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు నాయకత్వం వహించిన వారిలో ఇద్దరు మహిళా కమాండర్లు కీలక పాత్ర పోషించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర వహించడమే కాకుండా తదనంతర పరిణామాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు.
వీరిలో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆర్డర్ చేయడం సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా.. కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుందిన ఆ రాష్ట్ర హైకోర్టు. అతుల్ శ్రీధరన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. మంత్రిపై వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాల్సింగా పోలీసులను ఆదేశించింది. నాలుగు గంటలలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందిగా సూచించింది.
మంగళవారం (మే 13) ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడుతున్న సందర్భంలో.. మంత్రి విజయ్ షా కల్నల్ సోఫియాను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఘటనపై ప్రతీకారం తీసుకోవడానికి దాడికి పాల్పడిన వారి కమ్యూనిటీకి చెందిన సోదరిని పంపారు ప్రధాని మోదీ’’ అని మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి.
‘‘మోదీ దేశం కోసం పోరాడుతున్నారు. పహల్గాం దాడితో మన బిడ్డలను విధరాండ్రుగా చేసిన వారిపైకి.. వారికి గుణపాఠం చెప్పేందుకు వారి కమ్యూనిటీకే చెందిన సోదరిని యుద్ధానికి పంపారు’’ అని పబ్లిక్ మీటింగ్ అన్నారు. టెర్రరిస్టుల కమ్యూనిటీకి చెందిన కల్నల్ సోఫియా కురేషి అనే సిస్టర్ ను యుద్ధానికి పంపారు మోదీ అనే అర్థంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పం అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు కోరారు.
మంత్రి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న హైకోర్టు.. ఈ కేసుపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో పాటు డీజీపీకి నిర్దిష్టమైన సూచనలు చేసింది. మే 15న ఈ కేసులో వాదనలు జదనలు జరగనున్నాయి.
మంత్రిని బర్తరఫ్ చేయకుంటే ఉద్యమమే: కాంగ్రెస్
కల్నల్ సోఫియా ఖురేషిపై బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఆయనపై కేసు నమోదు చేసినట్లు మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ తెలిపారు. ఒకవైపు సైనికులను మోదీ పొగుడుతుంటే విజయ్ షా మాత్రం అవమానించేలా మాట్లాడారని ఆయన అన్నారు. దేశం మొత్తం సైనికుల వెంట ఉంటే.. ఈ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని అన్నారు. మంత్రి విజయ్ షాను 24 గంటల్లో బర్తరఫ్ చేయకుంటే.. రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.