
కొత్తపల్లి, వెలుగు: హిందూ సనాతన ధర్మం పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల వద్ద హల్చల్ చేసిన అఘోరీ శ్రీనివాస్‌పై కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదైంది. నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లోకెక్కిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి చెందిన ఎల్లారి శ్రీనివాస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతేడాది నవంబర్ 21న కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మహిళను ట్రాప్ చేసి కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని, జగిత్యాల జిల్లా కొండగట్టుకు తీసుకెళ్లి తాళి కట్టాడని కేసు నమోదుచేశారు.
ఆ తర్వాత బాధితురాలి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన నిందితుడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలికి ఫోన్ ద్వారా పరిచయమైన శ్రీనివాస్ మొదట సనాతన ధర్మం గురించి చెబుతూ ఆమెను ట్రాప్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొత్తపల్లి పోలీసులకు అఘోరీ శ్రీనివాస్‌పై ఏప్రిల్ 28న బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై క్రైం నంబర్ 201/2025, సెక్షన్ 64(1), 87, 318(4), 351(2) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.