నకిలీ డాక్యుమెంట్‌‌తో రిజిస్ట్రేషన్‌‌.. కేసు నమోదు

నకిలీ డాక్యుమెంట్‌‌తో రిజిస్ట్రేషన్‌‌.. కేసు నమోదు

మానకొండూర్, వెలుగు: ఫోర్జరీ ధ్రువీకరణ పత్రంతో ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తండ్రీకొడుకుతోపాటు మరో వ్యక్తి పై మానకొండూరు పోలీస్ స్టేషను లో ఆదివారం కేసు నమోదైంది.‌‌ మానకొండూర్ గ్రామానికి చెందిన అడప రామయ్య కుమారుడు సందీప్ పేరున ఉన్న ఇంటి స్థలం గతంలో రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఇదే స్థల‌‌ంపై రామయ్య సోదరుడు అడప వీరయ్య తన పేరున నకిలీ ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకుని కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తన కుమారుడైన వినయ్ పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. 

ఈ రిజిస్ట్రేషన్ కు కరుణాకర్ సాక్షి  సంతకం చేశాడు. మళ్లీ సేల్ డీడ్ ద్వారా కరుణాకర్ కు రిజిస్ట్రేషన్ ‌‌చేశారు.‌‌ విషయం తెలుసుకున్న ఆడప రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్ కుమార్ వెల్లడించారు.