
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీలు, రైతుల దగ్గర అధిక వడ్డీలు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్న వ్యాపారులపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏకకాలంలో 43 బృందాలచేత 13 మండలాలలో దాడులు నిర్వహించారు.
అధిక వడ్డీలతో రైతులు ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, భూములు రాయించుకుని వడ్డీలకిస్తున్నారు వడ్డీ వ్యాపారాలు.
మొత్తం 13 మండలాలలో దాడులు చేసిన పోలీసులు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు నమోదు చేశారు. ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డేట్స్ స్వాధీనం చేసుకున్నారు.
నార్నూర్ లో బంగారం కొదవ పెట్టుకుని అధిక వడ్డీకిస్తున్న వ్యాపారి వద్ద నుండి 12 గ్రాముల బంగారం,235 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.