లాక్​డౌన్‌పై తప్పుడు సమాచారం వైరల్ చేస్తే..

లాక్​డౌన్‌పై తప్పుడు సమాచారం వైరల్ చేస్తే..

 

  • సోషల్ మీడియాపై సైబర్ పోలీసుల నజర్
  • కరోనా, లాక్​డౌన్, నైట్ కర్ఫ్యూలపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే సుమోటో కేసులు
  • ఐటీ సెల్, సైబర్ క్రైమ్ టీమ్స్​తో మానిటరింగ్
  • వాట్సాప్, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ పోస్టింగ్స్‌‌‌‌పై నిఘా

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టింగ్స్ పై సైబర్ పోలీసులు ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలోని పోస్టింగ్స్ ఆధారంగా కేసులు బుక్ చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూపై గతేడాది న్యూస్​ను సర్క్యులేట్ చేసిన యూట్యూబ్ చానెల్​పై బుధవారం కేసు రిజిస్టర్  చేసిన సంగతి తెలిసిందే. గతేడాది పోలీసులు లాఠీచార్జి చేసిన న్యూస్ ను ప్రస్తుతం జరిగినట్లుగా చూపిస్తూ వైరల్ చేయడాన్ని సీపీ అంజనీకుమార్ సీరియస్ గా తీసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసి వారిపై యాక్షన్ తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. 5 జోన్ల పోలీసులు, సైబర్ క్రైమ్ టీమ్​తో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పబ్లిక్​ను ప్యానిక్ చేసేలా మార్ఫింగ్ ఫొటోలతో ఫేక్ న్యూస్ ను సర్య్కులేట్ చేసేవారిపై యాక్షన్ తప్పదని ఆయన హెచ్చరించారు.

మార్ఫింగ్‌‌‌‌ వీడియోస్‌‌‌‌, క్లిపింగ్స్‌‌‌‌..
న్యూస్ చానెల్స్ బ్రేకింగ్ గ్రాఫిక్ ప్లేట్స్, విజువల్స్​ను మార్ఫింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గతేడాది జనతా కర్ఫ్యూ, లాక్​డౌన్ వీడియోలతో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వారిపై నిఘాపెట్టారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ పోస్టింగ్స్​ను పరిశీలిస్తున్నారు. స్పెషల్ బ్రాంచి అందించే సమాచారంతో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఐటీ సెల్, సైబర్ క్రైమ్ టీమ్స్ తో డేటా కలెక్ట్ చేస్తున్నారు. రూమర్స్ పోస్టింగ్ చేస్తున్న వారిని గుర్తించేలా టెక్నికల్ ఎక్స్​పర్ట్స్ సపోర్టు తీసుకుంటున్నారు. వీడియోలు, వాట్సాప్ గ్రూప్ ఆధారంగా సుమోటో కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. 
 

వాట్సాప్ నుంచే ఎక్కువ..

ఫేక్ న్యూస్‌‌‌‌ షేరింగ్‌‌‌‌ వాట్సాప్‌‌‌‌ గ్రూప్​ల నుంచే ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ తో పాటు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లోనూ ఫేక్ న్యూస్ పోస్టింగ్స్, షేరింగ్స్ జరుగుతున్నట్లు తేల్చారు. పోస్టింగ్ తీవ్రతను బట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేసే గ్రూప్ అడ్మిన్స్​ను కూడా బాధ్యులుగా చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ఫేక్ జీవోను క్రియేట్ చేసిన  చార్టెడ్ అకౌంటెంట్ సంజీవ్ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫేక్ న్యూస్ వల్ల పబ్లిక్ ప్యానిక్ అయ్యే అవకాశాలున్నాయని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో షేరింగ్స్ జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టామని, సుమోటో కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.