Good Health : జీడిపప్పు పాలు తాగితే.. ఎంత ఆరోగ్యం ఉంటారంటే..!

Good Health : జీడిపప్పు పాలు తాగితే.. ఎంత ఆరోగ్యం ఉంటారంటే..!

కొందరు పాలలో పసుపు వేసుకుని కొండగుంటారు. అయితే పాలలో జీడిపప్పు వేసుకుని తాగితే మరీ మంచిది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఎందుకంటే... రోజంతా పని చేసి చేసి బాడీ, మైండ్ రెండూ అలసిపోతుంటాయి. కొన్నిసార్లు పెళ్లిళ్లు, ఫంక్షన్ ల కారణంగా నైట్ నిద్ర మరీ ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు జీడిపప్పు కలిపిన పాలు తాగితే మైండ్ రిలాక్స్ అయ్యి, నిద్ర కూడా బాగా పడుతుందట. 

జీడిపప్పుని వంటల్లో వాడతారని తెలిసిందే. వాటితో పాటు మధ్యాహ్నం ఏవైనా తినాలనిపిస్తే వీటినే తింటుంటారు చాలామంది. అంతగా జీడిపప్పులో ఏముంటాయబ్బా? అంటే... జీడిపప్పు కొలెస్ట్రాల్ లెవల్స్ని పెంచుతుందని అంటారు. కానీ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. కేవలం ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. 

Also Read : Good Health : రుచికే కాదు.. మంచి ఆరోగ్యానికీ పుదీనా ఎంతో మేలు

వీటిలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. అది కరోనరీ హార్ట్ డిసీజెస్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవి బోన్ హెల్త్ కు కావాల్సిన మినరల్స్ ని కూడా అందిస్తాయి. బ్రెయిన్కి మంచి ఫుడ్ ఇవే. అందుకే వీటిని "నాచురల్ డిప్రెశాంట్స్" అంటారు. జీడిపప్పు పాలు తాగితే ఈ లాభాలన్నీ శరీరానికి అందుతాయి.

తయారీ ఇలా..

పాలలో కొన్ని జీడిపప్పులు వేసి నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసి, పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ని గిన్నెలోకి తీసుకొని, అందులో మరికొన్ని పాలు పోయాలి. ఆ పాల మిశ్రమాన్ని కాసేపు మరిగించి, తగినంత చక్కెర వేసి, వేడిగా లేదా చల్లగా ఎలా అయినా తాగొచ్చు.