
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్ సబ్సిడరీ డెల్టాటెక్ గేమింగ్ ఐపీఓకి రాబోతోంది. ఇందుకు గాను సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసింది. ఐపీఓ ద్వారా రూ.550 కోట్లను సేకరించాలని డెల్టాటెక్ చూస్తోంది. కొత్తగా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ. 300 కోట్లను సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద కంపెనీ ప్రమోటర్ డెల్టా కార్ప్ రూ. 250 కోట్ల విలువైన షేర్లను అమ్మనుంది.