విజయ్68 లేటెస్ట్ అప్డేట్.. షూటింగ్ షురూ చేసిన దళపతి

విజయ్68 లేటెస్ట్ అప్డేట్.. షూటింగ్ షురూ చేసిన దళపతి

కోలీవుడ్​స్టార్​ హీరో విజయ్(Thalapathy Vijay)​ హీరోగా వెంకట్​ప్రభు డైరెక్షన్​లో వస్తోన్న విజయ్68 వ చిత్ర పూజ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ సందర్భంగా మేకర్స్ వీడియోను షేర్ చేశారు. AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. రీసెంట్ లియో హిట్ తో మంచి ఫామ్లో ఉన్న హీరో విజయ్..డైరెక్టర్ వెంకట్ ప్రభు కలిసి చేస్తున్న మొదటి చిత్రం ఇది. 

విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజయ్, స్నేహ వీరిద్దరూ 20 ఏళ్ల కిందట ‘వశీకర’ అనే సినిమాలో నటించారు. అది బ్లాక్​బస్టర్​ విజయాన్ని అందుకుంది. వీరిద్దరి పెయిర్​కి మంచి రెస్పాన్స్​ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంటను తెరపై చూపించేందుకు ప్లాన్​ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

Also Read:- మరో మెట్టెక్కిన మట్టికథ

విజయ్ 68 లో లైలా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, యోగిబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇఫ్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. సాంగ్ షూటింగ్ తోనే ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని సమాచారం. ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్ గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే