మరో మెట్టెక్కిన మట్టికథ.. ఓటీటీలో విశేషదారణతో దూసుకెళ్తున్న అందరి కథ

మరో మెట్టెక్కిన మట్టికథ.. ఓటీటీలో విశేషదారణతో దూసుకెళ్తున్న అందరి కథ

కథలో కంటెంట్ ఉంటే..తెరకెక్కే ఎంత చిన్న సినిమా అయిన అందరి మనసులను గెలుస్తుంది. ఈ మాట ఎన్నో సార్లు ప్రూవ్ అయింది కూడా. రీసెంట్గా మన తెలుగు ఆడియన్స్ను మెప్పించిన కథల్లో మట్టికథ(Matti Katha) సినిమా పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. 

లేటెస్ట్ అప్డేట్ మేరకు..ఈ మట్టికథ మూవీ (అక్టోబర్ 13న) ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యి..ప్రజల్లో విశేషదారణ పొందిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు IMDB 8.8/10 రేటింగ్ కూడా ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంతటి బెస్ట్ రేటింగ్ ఏసినిమాకు రాలేదు. అంతేకాకుండా దసరా పండుగ సందర్భంగా రైతుల దగ్గర నుంచి ఇంట్లో ఉండే అమ్మ నాన్న, చిన్న,పెద్ద, పట్నం నుంచి ఊరికి వచ్చే పరివారం అంత కలిసి.. అతి ఎక్కువ సార్లు చూసిన చిత్రంగా మట్టికథ మరోమెట్టుపై నిలిచింది. 

మొన్నటికి మొన్న రిలీజైన బలగం సినిమా కుటుంబ మానవ సంబంధాల్ని బలపరచితే..మట్టికథ మూవీ తెలంగాణ సంస్కృతిని,పల్లెల్లో ప్రజల జీవన విధానాన్ని, భూమిని నమ్ముకుని వ్యవసాయమే జీవణాధారంగా తెరకెక్కించబడింది. ఈ మూవీలో జనాల భావోద్వేగాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన మట్టికథ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ హ్యాపీ గా ఉన్నారు.  

ఈ సినిమా రిలీజ్కు ముందే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టివల్‌లో పలు విభాగాల్లో 9 అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్, డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ వంటి తదితర కేటగిరీల్లో మట్టికథకు అవార్డులు వరించాయి. 

మట్టికథ మూవీకి పవన్ కడియాలా డైరెక్ట్ చేయగా..అజేయ్ వేద్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాతగా.. సతీష్ మంజీర సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ జానపద గాయని కనకవ్వ, బలగం తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు.