డిప్యూటీ మినిష్టర్‌గా పిల్లి.. ఎందుకో తెలుసా?

డిప్యూటీ మినిష్టర్‌గా పిల్లి.. ఎందుకో తెలుసా?
చెత్తలో విసిరేస్తే.. డిప్యూటీ మినిస్టర్ అయింది! ఎనకటికెవరో తంతే.. బూరెల బుట్టలో పడ్డడంట. ఇప్పుడీ పిల్లికీ అంతకంటే ఎక్కువ అదృష్టమే దక్కింది. దీనిని ఎవరో చెత్త కుప్పలోకి విసిరేస్తే.. బతికి బయటపడటమే కాకుండా.. ఏకంగా డిప్యూటీ మినిస్టర్ కూడా అయింది! చెత్త కుప్ప నుంచి మినిస్టర్ కుర్చీ దాకా సాగిన ఈ పిల్లి లక్కీ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టోరీలోకెళ్తే.. అది రష్యాలోని ఉల్యానోస్క్ సిటీ. సోమవారం ఆ సిటీలో చెత్తను వేరు చేసే ఓ గార్బేజ్ ప్లాంట్ లో.. చెత్తంతా కన్వేయర్ బెల్ట్ మీదుగా క్రషింగ్ మెషీన్ లోకి వెళ్తోంది. సిబ్బంది చెత్తను బెల్ట్ పై సర్దుతూ, వేరు చేసే పనిలో ఉన్నారు. ఇంతలో మిఖాయిల్ తుకాష్​ అనే వర్కర్ కు తెల్లటి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఏదో మెత్తగా ఉన్నట్లుగా చేతికి తగిలింది. వెంటనే బ్యాగ్ ను కట్ చేశాడు. అందులోంచి ఓ నల్ల పిల్లి.. కన్నార్పకుండా చూస్తోంది. కొంచెం లేటయ్యుంటే దాని కథ అక్కడితోనే ముగిసిపోయేది. కానీ.. ఆ పిల్లిని మిఖాయిల్ కాపాడాడు. ఆ సీన్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది. దీంతో ఆ వీడియో లోకల్ టీవీలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిల్లి సడెన్ గా సెలబ్రిటీ అయింది. మిఖాయిల్ హీరో అయ్యాడు. విషయం ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ గుల్నారా రఖ్మతులినాకు తెలిసింది. ఇంకేం.. ఆ పిల్లిని దత్తత తీసుకున్న మినిస్టర్.. ఆఫీసుకు తీసుకెళ్లారు. అనధికారికంగా డిప్యూటీ మినిస్టర్ పదవినీ కట్టబెట్టి.. కుర్చీలో కూచోబెట్టారు. దానికి మంచి పేరు కూడా పెట్టాలని నేషనల్ కాంటెస్ట్ ప్రకటించారు. పెంపుడు జంతువులను ఇలా విసిరేయొద్దని.. ఎవరికైనా ఇవ్వాలని లేదా షెల్టర్లకు అప్పగించాలని ప్రజలను కోరారు. For More News.. నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్‌ చైనాలో లోడ్ దించనిస్తలే.. మనోళ్లను వెనక్కి రానిస్తలే.. ఉచితంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్