పదవులు ఇప్పిస్తామంటూ 100 కోట్లు వసూలు

పదవులు ఇప్పిస్తామంటూ 100 కోట్లు వసూలు

రాజ్యసభ సీట్లు, నామినేటెడ్ ప్రభుత్వ పోస్టులు దక్కేలా పైరవీలు చేస్తామంటూ కొందరు చీటింగ్ కు పాల్పడ్డారు. మాయమాటలతో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులను బురిడీ కొట్టించారు. వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశారు. ఈవిధంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఆ ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో కమలాకర్ ప్రేమ్ కుమార్ బండ్గర్ (మహారాష్ట్ర),   రవీంద్ర విఠల్ నాయక్ (కర్ణాటక), మహేంద్ర పాల్ అరోరా (ఢిల్లీ) అనే వ్యక్తులు ఉన్నారు. మరో వ్యక్తి పేరు, వివరాలు తెలియాల్సి ఉంది. 

మహారాష్ట్ర,  కర్ణాటక ప్రాంతాల్లో..

వీరంతా మహారాష్ట్ర,  కర్ణాటక ప్రాంతాల్లో ఈవిధమైన మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో చేతులు కలిపి రాజ్యసభ సీట్లు, నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని బుకాయించి చీటింగ్ కు తెగబడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీబీఐ ఎఫ్ఐఆర్ లోని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నామినేటెడ్ పదవులు దక్కుతాయనే ఆశతో ఎంతోమంది కోట్లాది రూపాయలు వీరికి ఇచ్చారని సీబీఐ తేల్చింది.