మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు

 మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలతో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీతోపాటు వివిధ పట్టణాల్లో ఆయనకు సంబంధించిన 30 చోట్ల దాడులు నిర్వహించింది సీబీఐ. ఆపరేషన్‌లో సుమారు 100 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.  

సత్యపాల్‌ మాలిక్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు  నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2022, ఏప్రిల్‌ నెలలో సత్యపాల్‌ మాలిక్‌ సహా ఐదుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

కాగా 2018, ఆగస్టు 23 నుంచి 2019, అక్టోబర్‌ 30 వరకు జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్ పనిచేశారు. సీబీఐ సోదాలపై సత్యపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. దాడులకు తాను భయపడేది లేదని, రైతుల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు.