
ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో తాను డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఈవోకి సిఫార్సు లేఖ పంపిన మోసగాడు పి. రామారావుపై సీబీఐ కేసునమోదా చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఏకేశర్మ జులై 7వ తేదీన చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ దిల్లీ విభాగం ... ఎఫ్ఎఆర్ నమోదుచేసింది.
డాక్టర్ రామారావుగా చెప్పుకుంటూ.. సదరు వ్యక్తి తనతోపాటు తన కుటుంబ సభ్యులు మొత్తం పది మందికి మే 10వ తేదీన స్వామివారి సుప్రభాత దర్శనం 9, 11వ తేదీల్లో మూడు ఏసీ డబుల్ బెడ్ రూమ్ వసతి సౌకర్యం కల్పించాలని ఈఏడాది మే 1వ తేదీన టీటీడీ ఈవోకు సిఫార్సు లేఖ రాసిన విషయంపై పీఎంఓ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
►ALSO READ | సనాతన ధర్మం అంటే చట్టాన్ని గౌరవించడం: CJI గవాయ్‌పై దాడి ఘటనపై పవన్ కల్యాణ్ రియాక్షన్