
న్యూఢిల్లీ: వరదలతో ఇటీవల ఢిల్లీలో ఐఏఎస్‌కు ప్రిపేర్అవుతున్న ముగ్గురు చనిపోయిన ఘటనలో రావూస్ స్టడీ సర్కిల్ సీఈఓ అభిషేక్ గుప్తాపై సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. నేరపూరిత హత్య, నిర్లక్ష్యం, భవన నిర్మాణంలో లోపాలకు సంబంధించి పలు సెక్షన్లను చేర్చారు.
జులై 27న ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ శిక్షణ అకాడమీ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు నీటమునిగి చనిపోయారు ఈ ఘటనపై స్టూడెంట్స్ ఆందోళనకు దిగడంతో.. ఒక్కో అభ్యర్థి కుటుంబానికి రావూస్ కోచింగ్ సంస్థ రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.