మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఛార్జ్షీట్

మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఛార్జ్షీట్

మణిపూర్ మహిళలను నగ్నం ఊరేగించి కేసులో సీబీఐ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం  బాలుడితో సహా ఆరుగురు నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అస్సాంలోని గౌహతి ప్రత్యేక కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్ నివేదికను సమర్పించింది. నేరపూరిత కుట్ర, సామూహిక దాడి, మారణాయుధాలతో అల్లర్లు, మహిళలపై సామూహిక అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ యాక్టకు కింద సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.  

బిపనోమ్ గ్రామ సమీపంలోని వరి పొలంలో ఇద్దరు కుకీ -మహిళలను నగ్నంగా ఊరేగించిన మెయిటీ కమ్యూనిటీ పురుషుల గుంపును చూపించే వీడియో జూలై 19న వైరల్ అయింది. ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించాయి. గత నాలుగు నెలలుగా మణిపూర్ లో కుకీ, మేటి తెగలకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి.