ఢిల్లీ లిక్కర్ స్కాం: తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం: తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం  కేసులో సీబీఐ తొలి ఛార్జ్ షీట్  ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్ షీట్ ను అధికారులు దాఖలు చేశారు.  ఏడుగురిపైన సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో A1 గా కుల్దీప్ సింగ్, A2 గా నరేంద్ర సింగ్, A3గా విజయ్ నాయర్, A4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం  ఈ ఛార్జ్ షీట్ పై  రోస్‌ అవెన్యూ కోర్టులో  విచారణ జరగనుంది.

ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరిపింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది.  విజయ్ నాయర్, అభిషేక్ రావుకు  ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్  మంజూరు చేసింది.  దానిపై  స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. 

అభిషేక్ రావుకు 14 రోజుల రిమాండ్

ఈ కేసులో బోయినపల్లి అభిషేక్​కు సీబీఐ స్పెషల్ కోర్టు నిన్న 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. విజయ్ నాయర్​కు మరో 2 రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది.