
కాళేశ్వరంలో భాగంగా సుందిళ్ల,అన్నారం,మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రాథమిక విచారణ ప్రారంభించింది సీబీఐ. ప్రాజెక్ట్ లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ప్రాథమిక ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఎన్డీఎస్ ఏ రిపోర్ట్, జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ రిపోర్ట్స్ పై ప్రాధమిక దర్యాప్తు చేస్తోంది సీబీఐ. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సీబీఐ FIR నమోదు చేసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 1న కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే.. ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ ఆదారంగా సీబీఐ ఎంక్వైరీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ ,అంతరాష్ట్ర అంశాలపై విచారించాలని రిక్వెస్ట్ చేసింది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలని లేఖలో తెలిపింది. కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగాయని లేఖలో తెలిపింది ప్రభుత్వం. డిజైన్ ,క్వాలీటీ, లోపాలవల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ ఏ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఎన్డీఎస్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ప్రజాప్రతినిధులు,కాంట్రాక్టర్లు,అధికారులు,ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని కోరింది.
ALSO READ : బొగ్గు ఆధారిత ఉత్పత్తుల ధరలు తగ్గుతయ్
సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. తెలంగాణలో సీబీఐని నిషేదిస్తూ 2022 ఆగస్టు 30న కేసీఆర్ ఇచ్చిన జీవో 51ను రద్దు చేసింది ప్రభుత్వం.తెలంగాణలో సీబీఐని అనుమతిస్తూ జీవో నంబర్ 104ను రిలీజ్ చేసింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించిన ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.