మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలు శిక్ష

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలు శిక్ష

ఏపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్  కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. బ్యాంకు నుంచి 42 కోట్ల 79 లక్షలు లోన్ తీసుకుని దారి మళ్లించారని ఆమె పై కేసు నమోదు చేశారు . 2015 లో నమోదైన ఈ  కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంతో పాటు అప్పీల్ కు వెళ్లారు కొత్తపల్లి గీత. 

వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అధికారులు. వైద్య పరీక్షల తర్వాత చంచల్ గూడా విమెన్ జైలుకి తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో బ్యాంకు అధికారులు, విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకి అధికారులు తరలించారు . 

2015 లో నమోదైన కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఆమెకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు... లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె భర్త రామకోటేశ్వరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు... లక్ష రూపాయల జరిమానా విధించింది. బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కు కూడా ఐదేళ్ల శిక్ష వేసింది కోర్టు. దీంతో కొత్తపల్లి గీత సహా నిందితలను అదుపులోకి తీసుకుంది సీబీఐ.