బోయినపల్లి అభిషేక్‌‌రావుకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

బోయినపల్లి అభిషేక్‌‌రావుకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు

అభిషేక్‌‌రావు బెయిల్ పిటిషన్‌‌పై స్పెషల్‌‌ కోర్టులో సీబీఐ

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్‌‌రావుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చని సీబీఐ అధికారులు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న అభిషేక్‌‌రావు తనకు బెయిల్‌‌ ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ సందర్భంగా.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితుడు సాక్షులను బెదిరించవచ్చని, బెయిల్‌‌ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ తరఫు లాయర్‌‌‌‌.. సీబీఐ తన దర్యాప్తును ముగించిందని బెంచ్​కు వివరించారు.  విచారణ ఈ నెల 9 కి వాయిదా వేసింది.