లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉద్యోగి

లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉద్యోగి

సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్ అధికారి సురేష్ కుమార్పై సీబీఐ దాడులు చేసింది. గురువారం వేకువజామున నాచారంలోని కాంక్రీట్ ప్లాజా అపార్ట్మెంట్ 405 బి బ్లాక్లో ఉన్న ఆయన ఇంట్లో ముమ్మర తనిఖీలు చేశారు. 15 మందితో కూడిన సీబీఐ బృందం ఈ సోదాల్లో పాల్గొంది. సురేష్ కుమార్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. రైల్వే వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవహారంలో సురేష్ కుమార్ లంచం అడిగాడని వెల్లడించారు.