సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 రిజల్ట్స్‌ వెల్లడి

సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 రిజల్ట్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలను సోమవారం వెల్లడించింది. స్టూడెంట్స్ తమ రిజల్ట్స్‌ను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా చూసుకోవచ్చు. జూలై 15లోపు ఫలితాలు ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు గత నెలలో సీబీఎస్‌ఈ చెప్పింది. అందుకు తగ్గట్లే రిజల్ట్స్‌ను వెల్లడించింది. అయితే ఈ ఏడాది మాత్రం బోర్డు మెరిట్ లిస్ట్‌ను ప్రకటించలేదు. స్టూడెంట్స్ తమ రిజల్ట్స్‌ను డిజిలాకర్.జీఓవీ.ఇన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఫలితాలను చూడటానికి మైక్రోసాఫ్ట్‌ ఎస్‌ఎంఎస్ ఆర్గనైజర్‌‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వారి మార్కులను ఎస్‌ఎంఎస్‌ల రూపంలో తెలుసుకోవచ్చు.