నదిలో పడ్డ కారు : చిన్నారిని కాపాడడానికి పైకి విసిరేశారు

నదిలో పడ్డ కారు : చిన్నారిని కాపాడడానికి పైకి విసిరేశారు

ప్రమాదవశాత్తు కారు నదిలోపడ్డ సంఘటన మధ్యప్రదేశ్ లో గురువారం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి నదిలో పడింది. కారులో ఓ చిన్నారితో పాటు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. కారు నదిలో పడే సమయంలో తాము చనిపోయినా ఫర్వాలేదని చిన్నారిని బ్రిడ్జిపైకి విసిరారు. అయితే ఆ చిన్నారిని విసిరే క్రమంలో బ్రిడ్జిపైకి రాకపోవడంతో మళ్లీ నదిలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జిపైనున్న వారు కేకలు వేశారు. ధైర్యం చేసి కొందరు యువకులు వెంటనే నదిలోకి దూకి చిన్నారిని కాపాడారు. కారులో ఉన్న మిగిలిన ఐదుగురు కూడా చిన్న గాయాలతో సేఫ్ గా బయటపడ్డారు. వారిని సమీప హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

అయితే కారును ఢీకొట్టిన ఆటో మాత్రం అక్కడి నుంచి పరారైంది. ఈ దృశ్యాలన్నీ సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫూటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో దీన్ని చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై సీరియస్ అవుతున్నారు. అలాగే మానవత్వం ఇంకా బతికే ఉంది. సమయానికి స్పందించి పాపను కాపాడిన వారికి హ్యట్సాఫ్‌ అంటూ.. పాపను రక్షించిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.