Singer Zubeen Garg Last Rites: అమర గాయకుడి అంతిమయాత్ర.. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు..

Singer Zubeen Garg Last Rites: అమర గాయకుడి అంతిమయాత్ర.. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు..

ప్రముఖ బాలీవుడ్ సింగర్, అస్సాంకు చెందిన జుబీన్ గార్గ్ (52) మరణించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి చెందారు. అతని మరణం సినీ పరిశ్రమతో పాటుగా అభిమానులను మరియు అతని కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇవాళ ఆదివారం (సెప్టెంబర్ 21న) సింగర్ జుబిన్ భౌతికకాయం ఆయన స్వస్థలమైన గౌహతికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు వీధుల్లో బారులు తీరారు.

ఎయిర్ పోర్ట్ నుంచి సింగర్ జుబీన్ ఇంటివరకు హైవే మొత్తం జనసంద్రమైంది. అతని పార్ధివదేహంపై పూల వర్షం కురిపిస్తూ, బ్యానర్లు, కటౌట్లు పట్టుకుని, ఆయన పాటలను ఏకస్వరంలో పాడుకుంటూ సంతాపం తెలిపారు. అలాగే, జుబిన్ భార్య గరీమా సైకిమా కన్నీటి పర్యంతం అయ్యే వీడియో నెటిజన్లని ఎమోషనల్ అయ్యేలా ఉంది.

సింగర్ జుబీన్ గార్గ్..  కేవలం అస్సాంకు చెందిన సంగీతకారుడు మాత్రమే కాదు. అతను ఒక సాంస్కృతిక చిహ్నం. అతని పాటలు రోజువారీ జీవితంలో సౌండ్‌ట్రాక్‌గా మారాయి. ఆయన తన మనోహరమైన స్వరంతో గణనీయమైన ముద్ర వేసిన ఓ సంగీత శక్తి. ఆయన తన జీవితంలో 40కి పైగా భాషలలో 32,000 పాటలను పాడి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా ఈ సంగీత విధ్వంసుడి ఆకస్మిక మృతి పట్ల పీఎం మోదీ సంతాపం తెలిపారు. అమరగాయకుడికి అభిమానుల అశ్రుతర్పణం.. పాటల ప్రవాహంలో ఎప్పటికీ మదిలో ఉంటూనే ఉంటావని నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. 

సింగర్ జుబీన్ గార్గ్:

అస్సాం ఫెమస్ సింగర్గా పిలువబడే జుబీన్.. ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ నటించిన ‘గ్యాంగ్‌స్టర్’ మూవీలో ‘యా అలీ’తో జాతీయ ఖ్యాతిని పొందాడు. అప్పట్లో ఈ సాంగ్ ఇండియా మ్యూజిక్ ఆల్బమ్స్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 'దిల్ తు హి బాటా' (క్రిష్ 3) మరియు 'జానే క్యా చాహే మాన్' (ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్) వంటి సాంగ్స్తో బాలీవుడ్లో స్టార్ సింగర్గా ఎదిగాడు.

సింగర్ జుబిన్.. హిందీతో పాటు, అస్సామీ, బెంగాలీ, నేపాలీ మరియు అనేక ఇతర ప్రాంతీయ భాషలలో పాటలను పాడి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే, జుబీన్ సెప్టెంబర్ 20 మరియు 21 తేదీల్లో నార్త్-ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి సింగపూర్‌లో వెళ్లారు.