షాపింగ్ మాల్ లో సీలింగ్ గ్రిల్ ఊడిపడి ఇద్దరు స్పాట్ డెడ్

షాపింగ్ మాల్ లో  సీలింగ్ గ్రిల్ ఊడిపడి ఇద్దరు స్పాట్ డెడ్

గ్రేటర్  నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ లో ప్రమాదం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే చనిపోయారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడా సిటీలోని బ్లూ సఫైర్ మాల్ లో  సీలింగ్ గ్రిల్ ఊడిపడి ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. ఆదివారం కావడంతో మాల్ కు చాలామంది వచ్చారు. ఇదే క్రమంలో షాపింగ్ మాల్ లోని లాబీలో ఎక్సలేటర్ పక్కనే దగ్గర సీలింగ్ ఐరన్ గ్రిల్  ఒక్కసారిగా హరేంద్ర భాటి, షకీల్(35)లపై ఊడిపడింది. ఆ గ్రిల్ ఐదవ అంతస్థు నుంచి వారిపై పడిపోయింది. వీరిద్దరూ ఘజియాబాద్‌కు చెందినవారు. కొంతమందికి గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్ లో చేర్చారు.

మాల్ లోని వారు వెంటనే భయపడి మాల్ బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికే అక్కడ జనం అంతా గుమికూడారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరు బాధితులు ఎస్కలేటర్ వైపు వెళుతుండగా ఫెన్సింగ్ కోసం ఉపయోగించిన గ్రిల్ ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు డీసీపీ హృదేష్ కఠారియా తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఆయన అన్నారు.