గిన్నిస్ రికార్డుల్లో స్వాతంత్య్ర వేడుకలు

గిన్నిస్ రికార్డుల్లో స్వాతంత్య్ర వేడుకలు
  • సెప్టెంబర్.. పోషకాహార నెల
  • మన్‌‌‌‌ కీ బాత్‌‌‌‌లో ప్రధాని మోడీ ప్రకటన 
  • పోషకాహార లోపంపై అవగాహన పెంచాలని పిలుపు 

న్యూఢిల్లీ/భుజ్: పౌష్టికాహార లోపంపై పోరాడేందుకు ప్రజలందరూ కలిసిరావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. న్యూట్రిషన్ సమస్యను పారదోలేందుకు సామాజిక అవగాహన ముఖ్యమని అన్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ‘పోషణ్ అభియాన్‌‌‌‌ మాహ్‌‌‌‌(పోషకాహార నెల)’గా జరుపుకొందామని పిలుపునిచ్చారు.ఆదివారం మన్‌‌‌‌కీ బాత్‌‌‌‌లో ప్రధాని మాట్లాడారు.  పోషకాహార లోపంపై పోరాడేందుకు వివిధ రాష్ట్రాలు పలు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయని చెప్పారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా పాటించాలన్న ఇండియా ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించిందని, తృణధాన్యాల వల్ల ఎన్నో పోషక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. 

గిన్నిస్ రికార్డుల్లో స్వాతంత్య్ర వేడుకలు

75వ స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ నెలలో ‘అమృత ధార’లు దేశమంతటా ప్రవహిస్తున్నాయని ప్రధాని చెప్పారు. ‘‘దేశ ప్రజల ఉమ్మడి శక్తిని మనం చూశాం. ఇంత పెద్ద దేశంలో.. ఎన్నో వైవిధ్యాలున్నాయి. కానీ మువ్వన్నెల జెండాను ఎగుర వేసే సందర్భంలో మాత్రం అందరూ ఒకే స్ఫూర్తిని ప్రదర్శిస్తారు” అని నరేంద్ర మోడీ అన్నారు.  ఇండోర్‌‌‌‌‌‌‌‌లో హ్యూమన్ చైన్‌‌‌‌ ద్వారా ఇండియా మ్యాప్ రూపొందించారని, చండీగఢ్‌‌‌‌లో భారీ మానవహారంతో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

స్మృతి వన్ స్మారకం ప్రారంభం

గుజరాత్‌‌‌‌లోని కచ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భూకంపం సమయంలో ప్రజలు చూపిన దృఢత్వాన్ని గుర్తుచేసే ‘స్మృతి వన్’ స్మారకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. స్మృతి వన్.. భూకంపంలో చనిపోయిన వారికి నివాళి అని చెప్పారు. భుజ్ పట్టణానికి దగ్గర్లో భుజియో హిల్‌‌‌‌లో 470 ఎకరాల్లో నిర్మించిన స్మృతి వనం.. దేశంలోని తొలి భూకంప స్మారకం అని  ఆఫీసర్లు చెప్పారు. స్మృతి వన్‌‌‌‌లో ఎర్త్‌‌‌‌క్వేక్ మ్యూజియం ఏర్పాటు చేశారు.