
జవాన్ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో నయనతార(Nayanthara) దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రేజీ కపుల్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్టు ప్రకటించారు. 9స్కీన్(9Skin) అఫీషియల్ పేరుతో స్కీన్‌కేర్ ప్రాడక్ట్స్‌కి సంబంధించిన బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు వీరిద్దరూ చేసిన పోస్ట్ వైరలవుతోంది.
ఆరేళ్ల మా కృషి, ప్రేమను ఈ రోజు మీతో పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాం. మా అధికారిక బ్రాండ్‌ను ప్రకటించడం గర్వంగా, సంతోషంగా ఉంది. సెల్ఫ్ లవ్ ఎంతో ముఖ్యమని మేము నమ్మాం. ఇక ఈ నెల 29 నుంచి మా ప్రయాణం మొదలు కానుంది. ఆ రోజు నుంచి స్కిన్ కేర్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను మీరు మా అధికారిక సైట్‌లో కొనుగోలు చేయవచ్చు అని ఈ దంపతులు వెల్లడించారు.
ప్రస్తుతం ఏదైనా బ్రాండ్ ప్రచారం కోసం ప్రయివేట్ సంస్థలు, హీరోలు, హీరోయిన్లను కాంటాక్ట్ అవ్వడం తెలిసిందే. కానీ, ఏకంగా తమకంటూ సొంతంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని చాలా మంది స్టార్స్ ఆలోచిస్తున్నారు. ఇక ఇది వరకే, చాలా మంది హీరోయిన్స్ తమ సొంత బ్రాండ్స్ ని వినియోగిస్తున్నారు. అంతే కాకుండా పలు కంపెనీస్ కు బ్రాండ్ అంబాసిడర్లు గా ఉంటున్నారు.
Also Read :- బేబీ సినిమాకు పోలీసుల నోటీసులు
అందులో రష్మిక మందన్నా ఒకరు. రష్మిక చర్మ సంరక్షణకు వేగన్ స్కిన్‌కేర్ బ్రాండ్ ప్లమ్‌గాడ్సెస్ ఉత్పత్తులనే ఆమె ఎక్కువగా వినియోగిస్తుంది. కాగా ఈ కంపెనీలో రష్మిక పెట్టుబడి కూడా పెట్టినట్టు టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అనోమలీ అనే స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేసింది. అలాగే శృతి హాసన్ Pulp X Shruti పేరుతో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి మరిన్ని ప్రొడక్ట్స్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా పలువురు స్టార్స్ తమ సొంత బిజినెస్ రంగంలో దిగి అదృష్టం పరీక్షించుకోనున్నారు.
#self love is the best beauty secret. Stay tuned for exciting updates! #9SkinCares from 29th September ? pic.twitter.com/Amb9XAYGnx
— Nayanthara✨ (@NayantharaU) September 14, 2023
Today, we are extremely thrilled to reveal six years of relentless effort and love ?
— VigneshShivan (@VigneshShivN) September 14, 2023
We are proud & happy to introduce @9SkinOfficial ❤️❤️
Because we believe ..
Self-love is all we need. ✨
The #9SKIN journey begins on the 29th of September, 2023
Prepare for an amazing… pic.twitter.com/8UFWr13thu