బేబీ సినిమాకు పోలీసుల నోటీసులు

బేబీ సినిమాకు పోలీసుల నోటీసులు

టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood industry)లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవలే నిర్మాత కేపీ చౌదరి(KP Chaudary)ని డ్రగ్స్ ఇష్యూలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డ్రగ్స్ దందాలో మరో సినీ నిర్మాత ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. అలాగే డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించేలా ఇటీవల కాలంలో వచ్చిన పలు సినిమాలపై పోలీసులు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. 

Also read :-డ్రగ్స్ కేసులో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు

ఇటీవల విడుదలైన బేబీ మూవీపై సీపీ సీవీ ఆనంద్(CV Anand IPS) సీరియస్ అయ్యారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా బేబీ మూవీలో సీన్లు ఉన్నాయన్నారు. అలాగే ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలు.. ‘బేబీ’ సినిమాలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ‘బేబీ’ సినిమా బృందానికి నోటీసులు జారీ చేస్తామని సీపీ వెల్లడించారు.

యూత్ ప్రధాన టార్గెట్ గా బేబీ మూవీ

ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnawi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ యూతుఫుల్ ఎంటెర్టైనర్ బేబీ(Baby). ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టుకున్నప్పటికీ..పలు సన్నివేశాల్లో డ్రగ్స్ గురుంచి సీన్స్ ఉండటంతో..సీపీ సీవీ ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు. కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.