
పెద్దపల్లి, వెలుగు: సెల్ బే మొబైల్ షోరూమ్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయని, కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా 50 సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం (అక్టోబర్ 02) ప్రారంభించిన సెల్ బే షోరూమ్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సెల్ బే మంచి ప్రొడక్ట్స్‌ను వినియోగదారులకు అందించి వారి నమ్మకాన్ని పొందుతోందన్నారు. తాను కూడా కొన్ని వస్తువులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు సెల్ బే షోరూమ్‌ను రియల్ మీ ప్రతినిధి ఇవాస్ లీ ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీ కొనుగోలుపై రూ. 10 లక్షల విలువ చేసే బహుమతులు గెలుచుకునే విధంగా కూపన్స్ అందిస్తున్నామన్నారు.
అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఒప్పో సేల్స్ డైరెక్టర్ వంశీకృష్ణ, సెల్ బే ఎండి సోమా నాగరాజు, సుహాస్, సుదీప్, మంత్రి వివేక్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.