డాక్టర్ అవతారమెత్తిన సెల్ఫోన్ దొంగ..పేషెంట్ ను నమ్మించి రూ.40వేలు కాజేశాడు

డాక్టర్ అవతారమెత్తిన సెల్ఫోన్ దొంగ..పేషెంట్ ను నమ్మించి రూ.40వేలు కాజేశాడు

వాడు ఒక దొంగ..నగదు, సెల్ ఫోన్లు కొట్టేయడంలో దిట్ట.. హాస్పిటల్స్, ఆఫీసులు, బస్టాండ్లు ఇలా రద్దీగా ఉండే ప్రాంతాలే వీడి టార్గెట్..అప్పుడప్పుడు వేశాలు కూడా మారుస్తుంటాడు..డాక్టర్ అవతారమెత్తి తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ వ్యక్తిని ట్రాప్ లో పెట్టి డబ్బులు దొంగిలించే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు..ఇంకేముం దు ఊచలు లెక్కపెడుతున్నాడు.. వివరాల్లోకి వెళితే.. 

శుక్రవారం ఆగస్టు 2024న మధ్యాహ్నం తిరుపతి గవర్న్ మెంట్ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది.. మదనపల్లె కు చెందిన అశోక్ అనే వ్యక్తి తన కుమార్తెను చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నరసంపల్లి తాండాకు చెందిన బనావత్ సాయికుమార్ తిరుపతిలో వుంటున్నా డు.సెల్ ఫోన్లు, నగదు కొట్టేయడంలో దిట్ట. 

వైట్ కాలర్ డాక్టర్ కోట్, చేతిలో స్టెతస్కోప్ తో అశోక్ ను బోల్తా కొట్టించాడు. నిజంగా నే సాయికుమార్ డాక్టర్ అనే రీతిలో నమ్మించాడు. అశోక్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోవడంతోపాటు అతని ఖాతాలో ఉన్న రూ. 40వేల రూపాయలను ఆన్ లైన్ లో తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. 

మోసపోయానని తెలుసుకున్న అశోక్..రుయా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా తిరుపతి చెర్లోపల్లి రోడ్డులోని గరుడ సర్కిల్ వ ద్ద ఉండగా సాయికుమార్ ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోను, 35వేల రూపాయలు  స్వాధీనం చేసుకున్నారు.