- రూ.45 లక్షల విలువైన 8 ఆర్ఆర్ యూనిట్ల స్వాధీనం
ఓయూ, వెలుగు : సెల్‌ఫోన్ టవర్ల నుంచి సిగ్నల్స్ స్వీకరించే రిమోట్ రేడియో యూనిట్లు (ఆర్ఆర్ఆయూ)ను ఎత్తుకెళ్లే ముఠాను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.45 లక్షల విలువైన 8 ఆర్ఆర్ యూనిట్లను స్వాధీనం చేసుకుని కేసు ఫైల్ చేశారు. ఓయూ పీఎస్‌లో శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ బి. సాయిశ్రీ మీడియాకు వివరాలు తెలిపారు. ఇటీవల మాణికేశ్వరీనగర్లోని సెల్ టవర్ నుంచి ఆర్ఆర్ యూ చోరీ జరిగింది.
పోలీసులు స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ హమీద్ (33)ను అదుపులోకి తీసుకుaని విచారించగా, వరంగల్‌కు చెందిన భూక్యా అఖిల్ (20), గుగులోత్ తరుణ్ (22), గుగులోత్ ప్రవీణ్ (24) వద్ద కొన్నట్లు తెలిపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్, సైబరాబాద్, కరీంనగర్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
