700 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం: హైదరాబాద్‪లో కొట్టేసి సుడాన్ దేశంలో అమ్మేస్తున్రు

700 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం: హైదరాబాద్‪లో కొట్టేసి సుడాన్ దేశంలో అమ్మేస్తున్రు

హైదరాబాద్ స్పెషల్ టాక్స్ ఫోర్స్ పోలీసులు స్మార్ట్ ఫోన్లు దొంగలిస్తూ వాటిని ఇతర దేశాల్లో అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. వారి దగ్గర 713 సెల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు. ఈ కేసులో 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం  31 మంది గ్యాంగ్ గా ఏర్పడి.. రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్లు, వైన్ షాప్ లాంటి ప్లేసుల్లో ఫోన్లు కొట్టేస్తున్నారు. అందులో 15మందికి ముందుగానే అడ్వాస్ ఇచ్చి మొబైల్ ఫోన్లు కొట్టేయమని ప్రోత్సహించేవారు. మిగిలిన 15 మంది వాటిని అన్ లాక్ చేసి,IMEI నెంబర్ ట్యాంపరింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

జగదీష్ మార్కెట్ లో పని చేసే కొందరు టెక్నిషియన్లు అన్ అఫీషియల్ యాప్స్ వాడి IMEI నెంబర్లు ఛేంజ్ చేస్తున్నారు. వాటిని షిప్పుల ద్వారా ఆఫ్రికా, సుడనేషియా దేశాల్లో విక్రయిస్తున్నారు. ఈ గ్యాంగ్ లో అరెస్ట్ చేసిన 31 మందిలో ఒకరు సుడాన్ దేశానికి చెందిన వ్యక్తి. డ్యామేజ్ అయిన ఫోన్ల స్పేర్ పార్ట్స్ లొకల్ మొబైల్ రిపేర్ షాపుల్లో అమ్మేస్తున్నారు.