హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూతురు హ్యాపీగా ఉందనుకున్నారు.. కానీ..

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూతురు హ్యాపీగా ఉందనుకున్నారు.. కానీ..

హైదరాబాద్: గచ్చిబౌలిలో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చనిపోయిన ఘటన విషాదం నింపింది. మనీషా అనే యువతి హాస్టల్ గదిలో ప్రాణాలు తీసుకుంది. డీఎల్ఎఫ్ గేట్-2 ఎదురుగా ఉన్న హాస్టల్‌లో ఈ విషాదం జరిగింది. మనీషా స్వస్థలం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం.

‘నాన్నా..ఈ ఒంటరి జీవితం భరించలేకపోతున్నా.. మానసిక ఆందోళనతో అను క్షణం వేదన పడుతున్నా.. ఇక ఈ జీవితం నాకొద్దు’ అంటూ ఓ సాఫ్ట్వేర్​ఎంప్లాయ్​ తన తండ్రికి నోట్ రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

ఏపీ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామానికి చెందిన బందెల మనీషా(28) గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నానక్​రామ్​గూడలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. సోమవారం ఆఫీసుకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది.

సాయంత్రం రూమ్​మేట్స్ ​వచ్చి చూసేసరికి ఫ్యాన్కి ఉరివేసుకుని కనిపించింది. గదిలో తండ్రికి రాసిన నోట్ దొరికింది. తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని, ఒంటరితనంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు రాసింది.