Udaipur Files : వివాదంలో 'ఉదయపూర్ ఫైల్స్'.. 150 సీన్స్ తొలగించిన సెన్సార్ బోర్డు !

Udaipur Files : వివాదంలో 'ఉదయపూర్ ఫైల్స్'.. 150 సీన్స్ తొలగించిన సెన్సార్ బోర్డు !

‌‌రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉదయపూర్ ఫైల్ ' ( Udaipur Files ) వివాదాల్లో చిక్కుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతే కాదు150 సీన్స్  తొలగించింది. చివరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 11, 2025న విడుదలకు సిద్ధం అయింది. అయితే  తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.

ముస్లీం నేతల నుంచి అభ్యంతరాలు..
 తాజాగా ముస్లీం సంఘాల నుంచి  వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని జమాతే ఇ ఇస్లామి డిమాండ్ చేసింది.  ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోన్నట్లు ఉందన్నారు. ఇది విడుదల అయితే.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు .  మరోవైపు సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే అబు అజ్వీ 'ఉదయపూర్ ఫైల్' పై తీవ్ర అభ్యంతం వక్తం చేశారు.  ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఈ చిత్రం విడుదలైతే శాంతిభద్రతల సమస్య కూడ తలెత్తె అవకాశం ఉంది. కాబట్టి ఈ మూవీని అన్ని ప్లాట్ ఫ్లామ్ లలో  నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించాలని అబు అజ్వీ కోరారు.

ALSO READ : సమంత-రాజ్ కొత్త ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

 

సినిమా నేపథ్యం...
'ఉదయపూర్ పైల్స్' మూవీ అంతా ట్రైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు ఆధారంగా తెరక్కించినట్లు సమాచారం. జూన్ 28, 2022న, ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్ దుకాణంలోకి  కస్టమర్లుగా నటిస్తూ ప్రవేశించారు.  వారిలో ఒకరికి కన్హయ్య లాల్ కొలతలు తీసుకుంటుండగా.. వెంటనే మరొకరు అతనిని కత్తితో దాడి చేసి తలనరికేశారు. అంతే కాకుండా ఈ మొత్తం సంఘటన కెమెరాలో చిత్రీకరించి.. ఆ వీడియోను ఆన్ లైన్‌లో ప్రసారం చేశారు. ఇది దేశవ్యాప్తంగా అప్పుడు సంచలనం సృష్టించింది.

అయితే ఈ 'ఉదయపూర్ ఫైల్స్' మూవీ  ఏ మతానికో , విశ్వాసానికో సంబంధించినది కాదు.. భావజాలం, సత్యం గురించి మాత్రమే అని ఈ మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని  అమిత్ జానీ నిర్మిస్తున్నారు. కన్హయ్య లాల్ పాత్రలో విజయ్ రాజ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో దుగ్గల్, రజనీష్ , ప్రీతి ఘుంగియాని, కమలేష్ , సావంత్ , కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలో పోషిస్తున్నారు.