Samantha-Raj: సమంత-రాజ్ కొత్త ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

Samantha-Raj: సమంత-రాజ్ కొత్త ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

హీరోయిన్ సమంత.. చిత్రనిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొత్త వెకేషన్‌ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా సమంత తన అమెరికా వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. డెట్రాయిట్, మిచిగాన్‌లో దిగిన అనేక ఫోటోలను పోస్టు చేసింది. అక్కడ ఆమె తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2025 ఎడిషన్‌ వేడుకలకు హాజరైంది. 

ఇందులో సామ్ తన ఫ్రెండ్స్‌తో పాటుగా రాజ్తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ‘మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది’ అనే క్యాప్షన్ సమంత ఇచ్చింది. ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఫొటోలో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండడం, ఒకరిపై ఒకరు చేయి వేసుకుని, ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇంకో ఫొటోలో సమంత, రాజ్ ఒక రెస్టారెంట్‌లో పక్కపక్కనే కూర్చుని, స్నేహితులతో లంచ్ చేస్తున్నారు.

ఈ ఫొటోలపై సమంత ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అందులో ఓ అభిమాని ట్వీట్ చేస్తూ.. “సో.. బేబీ ఇది అధికారికమా?? మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను సామ్” అని కామెంట్ చేశాడు. మరొక అభిమాని.. “చివరకు మీ ప్రేమను కనుగొన్నా.. ఎంతో సంతోషంగా ఉందని” అన్నాడు. ఇక మరికొంతమంది నెటిజన్లు వీరిపై వచ్చే రూమర్స్ అన్నీ నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మధ్య సమంత మరియు రాజ్ నిడిమోరు వరుస వెకేషన్స్, ఈవెంట్స్ లలో కలిసే దర్శనమిస్తున్నారు. సమంత పోస్ట్ చేసే ఫొటోలే కాదు.. పెట్టె క్యాప్షన్స్ కూడా అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి డేటింగ్, పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఊపందుకుంటున్నాయి.

అయితే, ఈ ఊహాగానాలపై ఇప్పటివరకు సమంత ఎక్కడ స్పందించలేదు. కానీ, తమ కొత్త ఫోటోలు మాత్రం షేర్ చేస్తూనే ఉంది. ఇలా వీరి కథ ఎక్కడినుంచి ఎక్కడివరకు వెళుతుందో చూడాలని ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ALSO READ : Alia Bhatt: ఆలియా భ‌ట్‌ సంతకం ఫోర్జరీ.. రూ.77 లక్షలు కొట్టేసిన మాజీ అసిస్టెంట్‌

ఇకపోతే, సమంత, రాజ్ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల కోసం పనిచేశారు. ఆమె ఇప్పుడు అతనితో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో పనిచేస్తున్నారు.  అంతేకాదు.. వీరిద్దరూ చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్‌బాల్ జట్టుకు కూడా భాగస్వాములు. మరి  వీరిద్దరి మధ్య వచ్చే రూమర్స్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది తెలియాల్సి ఉంది.