నాజల్ వ్యాక్సిన్‭కు కేంద్రం ఆమోదం

నాజల్ వ్యాక్సిన్‭కు కేంద్రం ఆమోదం
  • నాజల్ వ్యాక్సిన్​కు కేంద్రం ఆమోదం
  • టీకా రూపొందించిన భారత్ బయోటెక్ 
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులోకి టీకా 
  • ఎయిర్ పోర్టుల్లో ఇయ్యాల్టి నుంచి కరోనా టెస్టులు
  • చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల కేసులు
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులోకి టీకా

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన నాజల్ డ్రాప్స్ కరోనా వ్యాక్సిన్ ‘ఇన్ కొవాక్ (బీబీవీ154)’ను బూస్టర్ డోస్ గా ఉపయోగించేందుకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఆమోదం తెలిపింది. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు ఈ టీకాను బూస్టర్ (ప్రికాషన్) డోస్ గా వేసుకోవచ్చని శుక్రవారం సాయంత్రం అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ లో ఏది రెండు డోసులు వేసుకున్నా ఇన్ కొవాక్​ను బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని తెలిపారు. 

నాజల్ వ్యాక్సిన్ ను వెంటనే కొవిన్ పోర్టల్​లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నేషనల్ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలోనూ ఈ టీకాను చేర్చనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇన్ కొవాక్ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐ గత నవంబర్ లోనే అనుమతి ఇచ్చింది. ఫేజ్ 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్ లో తమ టీకా సమర్థంగా పని చేసిందని భారత్ బయోటెక్ వెల్లడించింది.