
- 2,273 స్కూళ్లలో కరెంట్ కనెక్షన్ లేదు
- రాజ్యసభలో ప్రకటించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని చాలా బడుల్లో ఎలక్ట్రిసిటీ, ప్లేగ్రౌండ్ సౌకర్యం లేదని కేంద్రం ప్రకటించింది. స్టేట్లో మొత్తం రూరల్ ఏరియాల్లో 28,547 స్కూళ్లుండగా, వాటిలో 20,580 వాటికి మాత్రమే ప్లే గ్రౌండ్ ఉందని వెల్లడించింది. మరో 7,967 బడులకు ఆటస్థలం లేదని తెలిపింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఒక మెంబర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సమాధానమిచ్చారు.
2021–22 యూడైస్ లెక్కల ప్రకారం వివరాలను ఆయన తెలిపారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో మరో 2,273 బడులకు ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదని పేర్కొన్నారు. దేశంలో రూరల్ ఏరియాల్లో మొత్తం12,34,788 స్కూళ్లుండగా, వాటిలో 9,35,109 బడులకు మాత్రమే ఆటస్థలం ఉందని చెప్పారు. కరెంట్ సౌకర్యం 10,83,569 స్కూళ్లలో ఉందని స్పష్టం చేశారు.