రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ

రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ

తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరిస్తున్నామని తెలిపింది. 2018-19లో ఏపీ నుంచి 48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరిస్తే.. తెలంగాణ నుంచి 51 లక్షల 90వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పింది. 2019-20లో ఏపీ నుంచి 55లక్షల 33వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరిస్తే.. తెలంగాణ నుంచి డెబ్బై నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామన్నారు. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పింది కేంద్రం.