శ్రీతేజ్ కుటుంబానికి కేంద్రం చేయూత

శ్రీతేజ్ కుటుంబానికి కేంద్రం చేయూత
  •     మిషన్ వాత్సల్య కింద బాలుడి అక్కకు నెలకు రూ.4 వేలు

హైదరాబాద్, వెలుగు: పుష్ప సినిమా బెనిఫిట్ షోలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి కేంద్రం చేయాతను అందించింది. మిషన్ వాత్సల్య పథకం కింద బాలుడి అక్కకు నెలకు రూ.4 వేలు ఆర్థిక సాయాన్ని కేంద్రం అందించనుంది. గత ఏడాది డిసెంబర్ 5న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. 

అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని మహిళ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డిలు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి వినతిని మన్నించిన కేంద్రం మిషన్ వాత్సల్య స్కీమ్  కింద బాలుడి అక్కకు ప్రతి నెల రూ. 4,000 చొప్పున 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆర్థిక సహాయం అందించనుంది.