33 మంది తెలంగాణ నేతన్నలకు .. కేంద్రం రూ.30 లక్షల సాయం

33 మంది తెలంగాణ నేతన్నలకు .. కేంద్రం రూ.30 లక్షల సాయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. ఇందుకు దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 33 మంది నేతన్నలు ఉండగా, వారి ఖాతాల్లోకి కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ బుధవారం రూ. 30 లక్షలు విడుదల చేసింది.

ఒక్కొక్కరి అకౌంట్లోకి.. నెలకు రూ. 8వేల చొప్పున ఏడాదికి రూ.96 వేలను ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా జమచేసింది. దేశవ్యాప్తంగా 68 మంది లబ్ధిదారుల అకౌంట్లలోకి రూ. 62 లక్షలు జమ చేయగా.. ఇందులో సగం తెలంగాణకు చెందిన లబ్ధిదారులకు అందడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నేతన్నల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు పండుగలకు, శుభకార్యాలకు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వోకల్ ఫర్ లోకల్ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు.